శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (10:11 IST)

పురిటినొప్పుల్ని తట్టుకోలేక ఐదో అంతస్థు నుంచి దూకేసింది.. (వీడియో)

పురిటినొప్పులను తట్టుకోలేక సిజేరియన్ చేయాల్సిందిగా వేడుకుంది. అయితే తల్లిదండ్రులు ఆమె సిజేరియన్ చేసుకునేందుకు ఒప్పుకోలేదు. చైనా చట్టాల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి లేనిదే సిజేరియన్ చేయకూడదు. దీంతో పురి

పురిటినొప్పులను తట్టుకోలేక సిజేరియన్ చేయాల్సిందిగా వేడుకుంది. అయితే తల్లిదండ్రులు ఆమె సిజేరియన్ చేసుకునేందుకు ఒప్పుకోలేదు. చైనా చట్టాల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి లేనిదే సిజేరియన్ చేయకూడదు. దీంతో పురిటినొప్పుల్ని తట్టుకోలేక ఆ తొమ్మిదినెలల గర్భవతి.. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయమని వేడుకుంది. కానీ సిజేరియన్‌కు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. ఆమె ఆస్పత్రి ఐదో అంతస్థు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇక కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. తనకు సిజేరియన్ చేయాల్సిందిగా తల్లిదండ్రుల కాళ్లమీద పడి ఆ గర్భవతి వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనాయి. 41 వారాల గర్భవతి అయిన ఆ మహిళ కడుపులో పెరుగుతున్న పిల్లవాడి తల చాలా పెద్దగా ఉందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి ఆమెకు సిజేరియన్ ఆపరేషనే చేయాలి. చైనా చట్టాల ప్రకారం కుటుంబసభ్యుల అనుమతి లేకుండా సిజేరియన్ చేయరు. 
 
తల్లిదండ్రులు రాగానే ఆమె వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకుంది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శాంగ్జి ప్రావిన్స్‌లోని ఓ పేరుమోసిన ఆసుపత్రిలో చోటుచేసుకుంది. చైనా చట్టాల వల్లే గర్భవతి చనిపోయిందని నెటిజన్లు పైర్ అవుతున్నారు. అయితే మీడియా మాత్రం ఆమెది ఆత్మహత్యగా చూపెట్టింది. ఈ బాధను తట్టుకోలేక గర్భవతి తల్లిదండ్రుల కాళ్లపై ఎలా పడి వేడుకుందో మీరూ వీడియోలో చూడండి.