గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:02 IST)

విటమిన్ ట్యాబ్లెట్లు అనుకుని ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను మింగేసింది..

AirPod
AirPod
అమెరికాకు చెందిన ఓ మహిళ తన భర్త ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోను విటమిన్ మాత్రలుగా భావించి మింగేసింది. వివరాల్లోకి వెళితే.. 52 ఏళ్ల డాన్నా బార్కర్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో చిరకాల స్నేహితురాలిని కలిసింది. బార్కర్ స్నేహితురాలితో సంభాషణలో మునిగిపోయింది. ఆపై బార్కర్‌కు విటమిన్ మాత్రలు మింగాలనే విషయం గుర్తుకు వచ్చింది. 
 
స్నేహితురాలితో మాట్లాడుతూనే విటమిన్ ట్యాబ్లెట్లని భావించి.. అనుకోకుండా AirPods ప్రో మింగింది. ఆ తర్వాత బార్కర్ ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పింది. వెంటనే భర్త ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బార్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని తెలిపారు. దీనికి సంబంధించి బార్కర్ గత శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను 2.7 మిలియన్లకు పైగా వీక్షించారు.