శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (15:40 IST)

#WorldFoodSafetyDay పంచ ఆహార భద్రతా దినోత్సవం- డబ్ల్యుహెచ్ఓ సూత్రాలు

Food
కరోనా కాలంలో డబ్ల్యుహెచ్ఓ పంచ సూత్రాలను ప్రకటించింది. ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో మొదలుపెట్టింది. తినే తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి, పర్యాటకానికి సాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు సూత్రాలు పాటిస్తూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించ మంటోంది డబ్ల్యుహెచ్ఓ.
 
* వంట గదిలోకి వెళ్లిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. తడి లేకుండా చూసుకోవాలి.
* నిల్వ ఆహార పదార్ధాలను వీలైనంత వరకు తీసుకోకుండా ఉంటే మంచిది.
* వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి.
* ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అప్పుడే క్రిములు నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.
* శుభ్రమైన నీటిని ఉపయోగించి ఉప్పు నీటిలో కూరగాయలు కడగాలి. 
 
మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడుచేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలుకొని, విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది.