మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (19:15 IST)

కరోనాతో ప్రమాదం.. కరెన్సీతో లావాదేవీలొద్దు..

ప్రపంచ దేశాలను కరోనా కలకలం రేపిస్తున్న నేపథ్యంలో అధికంగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దంటూ కుదిరినంత వరకు డిజిటల్‌గా పేమెంట్లు చేయడమే ఉత్తమం అనే చర్చ జరుగుతోంది. సాధ్యమైనంత వరకు కార్డులు, నోట్లు వద్దు అంటూ చర్చ సాగింది.
 
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నోట్లు కంటే కూడా ఈ కాంటెక్ట్ లెస్ పేమెంట్‌లే మంచిదని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ పరికరాలకి ఎలానో కొరత లేదు కాబట్టి గూగుల్ పే ఫోన్ పే లాంటి వాటిల్లో ఖర్చు చెయ్యడం ఉత్తమమని వరల్డ్ హెల్త్ ఆర్గనిజేషన్ తెలిపింది.  
 
నేరుగా బ్యాంకు నుండి ట్రాన్సకాక్షన్ చెయ్యడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి కరోనా సోకకుండా వుండాలంటే కరెన్సీని కూడా అతిగా వాడటం మానేయాలని నిపుణులు అంటున్నారు. కరెన్సీ నోట్లతో కూడా కరోనాతో ప్రమాదమే కాబట్టి ఆన్ లైన్ పేమెంట్లే బెస్ట్ అంటున్నారు వైద్యులు.