అడల్ట్ సినిమాల్లో నటిస్తే ''చీప్'' అనే ముద్ర ఎందుకు వేయాలి? బాబు బాగా బిజీపై అవసరాల

బాహుబలి-2 సినిమాతో పోటీపడేందుకు ''బాబు బాగా బిజీ'' శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇదో అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమా కావడంతో బాహుబలి ఫీవర్‌లోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నా

గురువారం, 4 మే 2017 (15:38 IST)
బాహుబలి-2 సినిమాతో పోటీపడేందుకు ''బాబు బాగా బిజీ'' శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇదో అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమా కావడంతో బాహుబలి ఫీవర్‌లోనే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. బాహుబలిని చూసేందుకు వచ్చే వారంతా తమ సినిమాను కూడా చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా టైటిల్ రోల్ పోషించిన శ్రీనివాస్ అవసరాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్ అయ్యానని చెప్పాడు. బాహుబలి మాత్రమే థియేటర్లలో ఉండటం.. ఇతర తెలుగు సినిమా థియేటర్లలో కనిపించకపోవడంతో బాబు బాగా బిజీ పంట పండినట్టేనని చెప్పాడు. కొన్ని సీన్లను కట్ చేయగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని తెలిపారు. 
 
ప్రేక్షకులు ముక్కుపై వేలేసుకుంటారని.. ఊహించినట్లే సెన్సార్ 'ఎ' సర్టిఫికేట్ జారీ చేసిందని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. సాధారణంగా సినిమాల్లో హత్యలు చేసిన వాడిని బయట కిల్లర్ అంటారా..? అలాంటిది హాట్ సీన్లలో నటించినంత మాత్రాన బయట కూడా అదే దృష్టితో ఎలా చూస్తారని ప్రశ్నించారు. హాట్ సినిమాల్లో నటించేవారిపై ''చీప్'' అనే ముద్ర ఎందుకేయాలని అవసరాల ప్రశ్నించాడు. 
 
హంటర్ సినిమాకు రీమేక్‌గా వచ్చే బాబు బాగా బిజీ సినిమాను ముందుగా చేయకూడదని అనుకున్నట్లు తెలిపారు. సెకండ్ హాఫ్ వచ్చే సరికి తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు. ఇందులో స్నేహితుల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయన్నారు. ఈ కథేంటి అని ఆలోచించుకున్నాకే డిఫరెంట్‌గా వెళ్లాలని ఈ సినిమాలు చేశానని.. మొత్తానికి తెలుగులో రానంత గ్రాండ్ పక్కా అడల్ట్ కామెడీ సినిమా ఇదని సినీ పండితులు అంటున్నారు.

అన్నీ చూడండి

NEET పరీక్ష: Fathers Day నాడు కుమార్తె కోసం పోలీసు కాళ్లు పట్టుకున్న తండ్రి, వీడియో

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ట్రేడింగ్‌లో నష్టపోయాడు.. కిడ్నాప్ అయ్యానని రూ.50లక్షలు డిమాండ్ (video)

కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

హైదరాబాద్‌లో నీట్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య.. పాసవుతామో లేదోనని..?

అన్నీ చూడండి

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments