Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అబ్బా ఎండలు బాబోయ్.. షర్టులిప్పి ప్రాక్టీస్ చేసిన కింగ్స్ క్రికెటర్లు.. ఐపీఎల్‌ నుంచి స్మిత్ అవుట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంత గడ్డపై హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇందులో భాగంగా కింగ్స్ జట్టు క్రికెటర్లు తీవ్రంగా ప్రా

Written By Selvi
Updated: గురువారం, 20 ఏప్రియల్ 2017 (16:13 IST)
 
సూర్యుడి ప్రతాపంతో బెంబేలెత్తించడంతో స్వదేశీ క్రికెటర్ల విషయం పక్కనబెడితే.. విదేశీ ఆటగాళ్లు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఎండ తీవ్రత కారణంగా గురువారం తెల్లవారుజామున జరిగే ప్రాక్టీస్ సెషన్లలో క్రికెటర్లు షర్టులు తీసేసి పాల్గొన్నారు.
 
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కష్టాల్లో వున్న రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్-10వ సీజన్‌కు తాను దూరం కానున్నట్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్వయంగా వెల్లడించాడు. కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళుతున్నట్టు తెలిపాడు. ఐపీఎల్‌కు ముందు భారత్‌కు టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా వచ్చిన సంగతి తెలిసిందే. సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ కుటుంబాలకు దూరమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో తమ ఫ్యామిలీతో గడపాలని స్మిత్ డిసైడైనాడు. ఇందులో భాగంగా ఆరు రోజుల పాటు ఐపీఎల్‌కు దూరమవుతున్నట్టు స్మిత్ చెప్పాడు. దీంతో, రెండు మ్యాచ్‌లకు స్మిత్ దూరం కానున్నాడు. అయితే స్మిత్ ఈ టోర్నీకే దూరమయ్యే ఛాన్సుందని క్రికెట్ పండితులు అంటున్నారు. కాగా ఏప్రిల్ 22వ తేదీన హైదరాబాదుతో పూణే తలపడనుంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments