బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (17:19 IST)

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్...

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.449. ఈ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను తీసుకునే కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.449. ఈ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను తీసుకునే కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు కనుక మొత్తం 140 జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.
 
ఇందులో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 80 రోజుల వాలిడిటీకి 160 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం.