గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (16:22 IST)

వీవో నుంచి కొత్త ఫోన్.. Vivo V20 SE ధర రూ.20,999

Vivo V20 SE
భారత్‌లో వీవో నుంచి కొత్త ఫోన్ విడుదల కానుంది. భారత్‌లో ''వీవో వి20 ఎస్.ఈ.'' మొబైల్ లాంఛ్ చేయనున్నారు. అందుబాటు ధరలోనే ఈ మొబైల్ లభించనుందని టాక్. ఈ ఫోన్ ధరను రూ.20,999లు ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. 
 
వీవో వి20 ఎస్.ఈ.కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు వీవో సంస్థ టీజ్ చేస్తూనే ఉంది. అయితే పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. వీవో వి20 ఎస్.ఈ. మొబైల్‌ను వచ్చే వారం విడుదల చేయవచ్చని చెబుతూ ఉన్నారు. త్వరలో దీనిపై వీవో సంస్థ అధికారిక ప్రకటనను వెలువరించనుంది.
 
వీవో వి20 లైనప్‌లో భాగంగా విడుదల కాబోతున్న రెండో ఫోన్ ఇది. ఈ మొబైల్ లాంఛ్ అవ్వకముందే కొన్ని వివరాలు సామాజిక మాధ్యమాల్లో లీక్ అయ్యాయి. అందులో ఈ మొబైల్ ఫోన్ ధర కూడా ఉంది. 8జీబీ+128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ఉన్న మొబైల్ ఫోన్ ధరను 20990 రూపాయలు ఉండవచ్చని సమాచారం. ఈ మొబైల్ గ్రావిటీ బ్లాక్ కలర్, ఆక్వా మెరైన్ కలర్ లో కూడా లభించనుంది.