శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (17:11 IST)

రాన్సమ్ వేర్ సైబర్ అటాక్ ఇంకా ముగియలేదు.. ఏ క్షణంలోనైనా ఆండ్రాయిడ్?

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని.. ఏక్షణంలోనైనా మళ్లీ సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని.. ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరక్టర్ సంజయ్ బాహల్ వెల్లడించారు. ఇప్ప

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని.. ఏక్షణంలోనైనా మళ్లీ సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని.. ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరక్టర్ సంజయ్ బాహల్ వెల్లడించారు. ఇప్పటికే తొలి అటాక్‌లో ప్రపంచ దేశాల సిస్టమ్స్‌ను హ్యాక్ చేసి.. డేటాను స్తంభింప చేసిన రాన్సమ్ వేరు ఈసారి స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని సంజయ్ హెచ్చరించారు.
 
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే పలు డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లను పని చేయకుండా చేసిన రాన్సమ్ దెబ్బకు ఇక స్మార్ట్ ఫోన్లలోని డేటాకు గల్లంతయ్యే అవకాశం ఉందని సంజయ్ అన్నారు. ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్లను సైబర్ హ్యాకర్లు టార్గెట్ చేస్తే.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు కష్టాలు మొదలైనట్టేనని.. అందుకే దీనికి సంబంధించిన అలర్ట్‌లను బ్యాంకులు, పవర్, రైల్వే ప్రొవైడర్లకు పంపుతున్నట్లు సంజయ్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం స్పెషల్ టీమ్‌ను కూడా నియమించినట్లు సంజయ్ వెల్లడించారు.