శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (19:09 IST)

భారత్‌లో ఫుడ్ డెలివరీకి నో.. ఫ్లిఫ్ కార్ట్‌పై కేంద్రం నిషేధం

Flipkart
భారత్‌లో ఫుడ్ డెలివరీ చేసేందుకు ఫ్లిఫ్ కార్ట్ సంస్థపై కేంద్ర సర్కారు నిషేధం విధించింది. భారత్‌లో కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో వున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు ఆన్‌లైన్ సంస్థలు నష్టాలను చవిచూసిన సంగతి విదితమే. కానీ ప్రస్తుతం లాక్ డౌన్‌లో కేంద్రం సడలింపులు చేసింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఫుడ్ డెలివరీ సంస్థ భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 
 
గత ఏడాది ఆరంభంలోనే అమేజాన్ కూడా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కానీ ఫ్లిఫ్ కార్ట్ సంస్థపై కేంద్రం నిషేధం విధించింది. అమెరికా వాల్‌మార్ట్ బ్రాంచ్ అయిన ఫ్లిఫ్ కార్ట్ సంస్థ అత్యావసర, లగ్జరీ వస్తువుల విక్రయానికి అనుమతి ఇచ్చింది. 
 
ఇందుకోసం అనుమతులు పొందాల్సిన అవసరముందని.. అంతవరకు ఫ్లిఫ్‌కార్ట్ సంస్థ భారత్‌లో ఫుడ్ డెలివరీ చేయకూడదని నిషేధం విధించింది. అయితే ఫ్లిఫ్ కార్ట్ ద్వారా నూనెలు ఇతరత్రా సామాగ్రిని అమ్ముకోవచ్చునని కేంద్రం వివరణ ఇచ్చింది.