శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (11:47 IST)

ఇంటెక్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్: ధర. రూ.4,800.. ఫీచర్స్ ఇవే

బడ్జెట్‌ ఫోన్ల తయారీ సంస్థ ఇంటెక్స్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పలు బడ్జెట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంటెక్స్‌ , తాజాగా అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న ఈ

బడ్జెట్‌ ఫోన్ల తయారీ సంస్థ ఇంటెక్స్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పలు బడ్జెట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇంటెక్స్‌ , తాజాగా అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న ఈ ఫోన్‌ను విడుదల చేయడంతో కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ను రూ.4,800 గా సంస్థ నిర్ణయించింది.. ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే..
 
* 5 అంగుళాల తెర
* 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
* ఆండ్రాయిడ్‌ 6.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 8 జీబీ అంతర్గత మెమొరీ
* 2 ఎంపీ ముందు కెమెరా
* 5 ఎంపీ వెనుక కెమెరా
* 1 జీబీ ర్యామ్‌
* 4350 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం