Dharma Sangrah
✕

సెప్టెంబర్ 12న లాంఛ్ కానున్న ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్

Written By సెల్వి
Updated: గురువారం, 31 ఆగస్టు 2023 (15:04 IST)
iPhone 15 Series
ఆపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ మోడల్‌ల విడుదల తేదీని ధృవీకరించింది. దీని ప్రకారం సెప్టెంబర్ 12న జరిగే కార్యక్రమంలో ఆపిల్ తన కొత్త ఐఫోన్ మోడళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్ యాపిల్ అధికారిక ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 
 
ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 12న రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ మోడల్‌లను పరిచయం చేయబోతోంది. ఐఫోన్ 15 సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కొత్త ఐఫోన్ 15 సిరీస్ గురించిన వివరాలు చాలాసార్లు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. అలాగే, కొత్త ఐఫోన్ 15 సిరీస్ మోడల్‌లు లైట్నింగ్ పోర్ట్‌ను USBతో భర్తీ చేస్తాయి. ఇందులో టైప్ సి పోర్ట్ అందించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఐఫోన్‌లతో పాటు, ఆపిల్ రెండు కొత్త స్మార్ట్‌వాచ్ మోడళ్లను కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. వీటిని Apple Watch Series 9, Apple Watch Ultra 2గా పరిచయం చేయవచ్చు. ఇది Apple Watch Series 8 మోడల్‌కి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌గా కనిపిస్తోంది. కొత్త రెండవ తరం యాపిల్ వాచ్ అల్ట్రా మోడల్ 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడింది.

అన్నీ చూడండి

ప్రముఖ సినీనటుడు గిరిబాబు కన్నుమూత

Rajamouli's praise: రాజమౌళి ప్రశంసలతో థియేటర్లలోకి రాబోతున్న తమిళ థ్రిల్లర్ జాన్ డో

VISA :అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ చిత్రం VISA – వింటారా సరదాగా. డేట్ ఫిక్స్

గర్భం దాల్చిన తొలి మూడు నెలలు చాలా కష్టంగా ఉంటుంది : కియారా అద్వానీ

Pawan Kalyan, Dil Raju :బాలక్రిష్ణ పై త్వరలో క్లారిటీ ఇస్తా : పవన్ కళ్యాణ్ తో సినిమా వుంటుంది : దిల్ రాజు-

తర్వాతి కథనం
Show comments