1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (16:01 IST)

ఐకూ 7ఎస్ఈ ఫీచర్స్ లీక్..

iQOO Neo 7 SE
ఐకూ 7ఎస్ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల కానుంది. కానీ విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఐకూ 7ఎస్ఈలో 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు వుంటుంది.  4,880 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం వుంటుంది. 
 
అలాగే వెనుక భాగంలో మూడు కెమెరాలు, అందులో 64 మెగాపిక్సల్‌తో ప్రధాన కెమెరా వుంటాయి. దీని ధర రూ.25వేల నుంచి 30వేల మధ్య వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఐకూ 11 సిరీస్ ఫోన్లు డిసెంబర్ 2న విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆపై భారత్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.