సెప్టెంబర్ 10న మార్కెట్‌లోకి జియోఫోన్ నెక్ట్స్
అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి చౌకైన జియోఫోన్ నెక్ట్స్‌ను సెప్టెంబర్ 10న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.
ఈ ఫోన్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీ బుకింగ్స్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.
ఫీచర్స్:
* 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
* 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్
* 2/3జీబీ ర్యామ్
* 16/32 జీబీ స్టోరేజ్
* 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ
* క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా