బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (10:07 IST)

ఇక భారత్‌లో కరోనా శాశ్వతమా?

భారత్‌లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది.

పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే.

సార్స్-కోవి-2ను అంతం చేయొచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్' గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. 'నిర్మూలించడం కుదరదు' అని వారిలో 90శాతానికి పైగా సమాధానమిచ్చారు.