శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (16:05 IST)

ఆగస్టు 9న భారత్ మార్కెట్లోకి లెనోవో కె8 నోట్ స్మార్ట్ ఫోన్

లెనోవోకు చెందిన కె8 నోట్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు నుంచి భారత మార్కెట్లోకి రానుంది. గత ఏడాది డిసెంబురులో మార్కెట్లోకి వచ్చిన లెనోవో k6 నోట్‌కు వినియోగదారుల నుంటి సానుకూల స్పందన లభించడంతో... తదుపరి మోడల్ వి

లెనోవోకు చెందిన కె8 నోట్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు నుంచి భారత మార్కెట్లోకి రానుంది. గత ఏడాది డిసెంబురులో మార్కెట్లోకి వచ్చిన లెనోవో k6 నోట్‌కు వినియోగదారుల నుంటి సానుకూల స్పందన లభించడంతో... తదుపరి మోడల్ విడుదలపై లెనోవో కన్నేసింది. ఇందులో భాగంగా k8 నోట్‌ను విడుదల చేసేందుకు సమాయత్తమైంది. లెనోవో కె8 నోట్.. ఆగస్టు 9వ తేదీన భారత్‌ మార్కెట్లోకి రానున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఈ ఫోనును కిల్లర్ నోట్ పేరిట విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కె8 సంస్థ డుయెల్ కెమెరా మోడల్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌, 1.4జీహెచ్ మీడియా టెక్ హెలియో ఎక్స్20 ప్రోసెసర్, 4జీబీ రామ్‌తో కె8 నోట్ స్మార్ట్ ఫోన్ కస్టమర్ల ముందుకు రానుందని సంస్థ వెల్లడించింది.