Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

యూసీ బ్రౌజర్‌పై కన్నేసిన కేంద్రం.. వ్యక్తిగత వివరాలు చైనా సర్వర్‌కు వెళ్ళిపోతున్నాయట..

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియో

Written By Selvi
Updated: బుధవారం, 23 ఆగస్టు 2017 (10:38 IST)
చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో పాటు ఐఎంఎస్‌ఐ, ఐఎంఈఐ నంబర్లను, లొకేషన్‌ వివరాలను చైనాలోని సర్వర్‌కు పంపుతోందని సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ల్యాబ్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది.
 
యూసీ బ్రౌజర్ వైఫైకి అనుసంధానం అయినప్పుడు వినియోగదారుడి ఫోన్‌ వివరాలతో పాటు, యాక్సెస్‌ చేసే నెట్‌వర్క్‌ సమాచారం చైనాలోని ఓ సర్వర్‌కు పంపుతున్నట్లు ఆంగ్ల పత్రిక తెలిపింది. ఈ ల్యాబ్ విచారణలో యూసీది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇప్పటికే రెండు విడతలుగా 30 మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. తాజాగా రిలయన్స్‌ జియోకు చెందిన లైఫ్‌ బ్రాండ్‌ ఫోన్లతో పాటు, వీడియోకాన్‌, మైజు కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments