శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (12:41 IST)

ఆన్‌లైన్ మనీ లావాదేవీలు.. యూపీఐ యాప్‌లపై ఆంక్షలు

Google pay
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ నగదు లావాదేవీలు పెరగడంతో.. దానిపై కూడా కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో డీమోనిటైజేషన్ తర్వాత ఆన్‌లైన్ మనీ లావాదేవీలు బాగా ప్రోత్సహించబడ్డాయి. దీని కారణంగా, ప్రజలు ప్రస్తుతం నగదు లావాదేవీలు చేయడానికి Paytm, Phonepay, గూగుల్ పే వంటి అనేక UPI యాప్‌లను ఉపయోగిస్తున్నారు.
 
అదేవిధంగా పెట్టె దుకాణాల నుంచి పెద్ద దుకాణాల వరకు ఆన్‌లైన్ లావాదేవీల కోసం క్యూఆర్ కోడ్ కార్డులను ఉంచారు. ఈ సందర్భంలో, UPI ద్వారా నిర్వహించే డబ్బు లావాదేవీలకు పరిమితిని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. 
 
నివేదికల ప్రకారం, కొత్త పరిమితులు UPI యాప్‌ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 1 లక్ష లేదా 20 లావాదేవీలను పరిమితం చేసే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదనంగా, కొన్ని బ్యాంకులు వారపు UPI లావాదేవీ పరిమితిని ఏర్పాటు చేశాయి. ఉదాహరణకు, IDFC UPI కోసం నెలవారీ లావాదేవీ పరిమితి రూ. 30,00,000లకు నిర్ణయించాయి.