సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By preethi
Last Updated : గురువారం, 27 జులై 2017 (12:16 IST)

జియోకి ఆ పేరు ఎలా వచ్చిందో మీరెప్పుడైనా ఆలోచించారా...

ప్రస్తుతం దేశంలో ఎవరి నోట విన్నా జియో మాటే. ఉచిత వాయిస్ కాల్‌లు మరియు అపరిమిత డేటా సౌలభ్యాలతో రిలయన్స్ జియో సిమ్‌ను అందించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమవైపుకు తిప్పుకుంది.

ప్రస్తుతం దేశంలో ఎవరి నోట విన్నా జియో మాటే. ఉచిత వాయిస్ కాల్‌లు మరియు అపరిమిత డేటా సౌలభ్యాలతో రిలయన్స్ జియో సిమ్‌ను అందించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమవైపుకు తిప్పుకుంది. మిగిలిన టెలికాం సంస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇప్పుడు తాజాగా జియో ఫోన్ అంటూ కళ్లు చెదిరిపోయే ఫీచర్లతో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఇంతటి హైప్ క్రియేట్ చేసిన ఈ జియో అనే పేరు ఎలా వచ్చిందనడానికి రిలయన్స్ సంస్థ ఏ వివరణ ఇవ్వకపోయినా రెండు వాదనలు ప్రచారంలో ఉన్నాయి. 
 
అద్దంలో జియో ప్రతిబింబం చూస్తే ఆయిల్ లాగా కనిపిస్తుంది. రిలయన్స్‌కు ఆయిల్ సంస్థలు కూడా ఉన్నాయి, కనుక ఈ అర్థం వచ్చేలా జియో అనే పెరు పెట్టారని కొందరి అభిప్రాయం. రెండోది హిందీలో జియో అనగా జీవించు అనే అర్థం వస్తుంది. కనుక జియో డిజిటల్ లైఫ్ అనగా డిజిటల్ జీవితాన్ని జీవించండి అనే అర్థం వస్తుందని కొందరు జియో ప్రతినిధులు చెప్తున్నారు.