సంబంధిత వార్తలు
- వాట్సాప్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్...
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. క్విక్ ఫార్వర్డ్ బటన్ ఇక వుండదు.. కేవలం ఐదుగురికే?
- గోమాంసం తింటే హత్యలా..? వాట్సాప్, ఫేస్బుక్ వదంతులొచ్చేస్తే చంపేస్తారా?
- సన్నీలియోన్‌కు కష్టాలు.. ''కౌర్'' అనే పదం వాడకండి.. పాపకు పుట్టినరోజు
- ఫేక్ మెసేజెస్ ఫార్వర్డ్ చేశారో.. అంతే.. డేగ కన్నుతో వాట్సాప్ న్యూ ఫీచర్
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్...
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫలితంగా ఇకపై యూజర్లు అందులో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే వెసులుబాటు లభించింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ సహాయం
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫలితంగా ఇకపై యూజర్లు అందులో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే వెసులుబాటు లభించింది. వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ సహాయంతో ఒకేసారి నలుగురు గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.
అయితే ముందుగా ఇద్దరు యూజర్లు వన్ టు వన్ వీడియో చాటింగ్ మొదలు పెట్టాలి. అనంతరం ఇద్దరు యూజర్లను అందులోకి యాడ్ చేయాలి. దీంతో గ్రూప్ వీడియో కాలింగ్ సాధ్యపడుతుంది.
వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను యూజర్లు పొందవచ్చు.
