suvichar
✕

ఫేస్‌బుక్ తరహాలో వాట్సాప్... ఎలా..?

ఫేస్‌బుక్ కన్నా వాట్సాప్‌ను వాడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఆదరణకు తగ్గట్టుగా వాట్సాప్ యాజమాన్యం కూడా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తోంది.

Written By tj
Updated: ఆదివారం, 6 ఆగస్టు 2017 (14:07 IST)
ఫేస్‌బుక్ కన్నా వాట్సాప్‌ను వాడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఆదరణకు తగ్గట్టుగా వాట్సాప్ యాజమాన్యం కూడా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తోంది. ఫేస్‌బుక్‌లో ఎలాగైతే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్‌లను మార్చుకుంటామో.. అలాగే వాట్సాప్‌లోనూ మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. ఫాంట్ ఎమోజీలను ఉపయోగించి ఎప్పటికప్పుడు రంరంగుల చిత్రాలను మార్చుకునే అవకాశం ఇక వాట్సాప్ ప్రియులకు రానుంది. ఆండ్రాయిన్ బేటా వెర్షన్‌లోని 2.17.191లో ఫీచర్‌ను జతచేశారట.
 
ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కొంతమందికి మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నారట. స్టేటస్‌లో ఏదైనా అక్షరాలను రాసిన తర్వాత వాటికి కలర్ బ్యాగ్రౌండ్ పెట్టడం, ఫాంట్ స్టెల్‌ను మార్చుకోవడం, ఎమోజీలను కలుపుకోవడం వంటివి కూడా ఇక నుంచి సులువుగా చేసుకోవచ్చు. 
 
ఇప్పటికే వీడియో కాల్‌లో ఇమేజ్ ఇన్‌మోడ్, స్టికర్లు పంపుకునే అవకాశంతో పాటు టెక్ట్స్ కొత్త ఎఫెక్ట్స్ కలుపుకునేలా ఫీచర్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. రంగు రంగుల బ్యాక్ గ్రౌండ్ మార్చుకునే అవకాశమొస్తే వాట్సాప్ ప్రియులకు ఇక పండుగే. 

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments