Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పిల్లలూ... తపఃఫలం ఏంటో తెలుసుకోండి!

Written By Selvi
Updated: గురువారం, 11 డిశెంబరు 2014 (17:58 IST)
బుద్ధుని దగ్గరకు వచ్చిన ఒక యోగి.. ''భగవాన్! నేను ఆరు నెలలు తపస్సు చేసి నీటిలో మునిగిపోకుండా ఉండే శక్తులు సంపాదించాను అన్నాడు. ''అలాగా! ఏదీ నీ శక్తులు చూపించు'' అన్నాడు బుద్ధుడు. ఆ యోగి ఆ పక్కనే ఉన్న నది నీటి మీద నడుస్తూ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్లి గర్వంగా నిలబడ్డాడు. 
 
"మళ్లీ వెళ్లిరా!" అన్నాడు బుద్ధుడు. భగవాన్ ! మళ్లీ రావాలంటే మరో ఆరు నెలలు తపస్సు చేయాలి అన్నాడు. చూశావా! ఎంత అజ్ఞానంలో ఉన్నావో! ఒక్క రూక ఇస్తే పడవ మీద వెళ్లి రాగలిగిన పనికి ఆర్నెల్లు వృథా చేస్తున్నావు. అయినా మనం మునిగి పోకుండా ఉండాల్సింది నీటిలో కాదు. 
 
కామం, క్రోధం, ధన వ్యామోహం, లోభం, మద మాత్సర్యాలు, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనే అమానవీయ విషయాల్లో మునిగిపోకూడదు. వాటిలో మునక్కుండా ఉండేందుకు మన శక్తియుక్తుల్ని వినియోగించాలి. అదే సరైన యోగం, ధ్యానం అన్నాడు బుద్ధుడు. ఆ యోగికి జ్ఞానోదయమై బుద్ధుణ్ని అనుసరించాడు.

అన్నీ చూడండి

October 04, 2026: మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

బతుకమ్మ, దసరా వేడుకలు ముస్తాబవుతున్న భాగ్యనగరం

కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన కేజేపీ21 అనే ఆడ చిరుత (video)

APSRTC: దసరా పండుగ రద్దీ.. హైదరాబాద్, వైజాగ్ నగరాలకు ప్రత్యేక బస్సులు

చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి దొరికాడోచ్... స్థానికులే పోలీసులకు...?

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

Show comments