Daily Horoscope
✕

ప్రేయసి మనసును జయించాలంటే... ?

Written By Munibabu
Updated: మంగళవారం, 2 జూన్ 2009 (13:56 IST)
ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం... అన్నాడో సినీకవి. నిజమే మనసును దోచిన ప్రేయసి ఊహల్లో తనతో షికారు చేస్తున్నా నిజ జీవితంలో మాత్రం తనను చూస్తేనే మండిపడుతుంటే సదరు ప్రేమికుని హృదయ వేదన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి మనసుకు నచ్చిన ప్రేయసిని తనవైపుకు తిప్పుకోవాలంటే ప్రేమికుడు ఏం చేయాలి ? మనసుకు నచ్చిన ప్రేయసి అసలు తనను చూస్తేనే ఎందుకు చిరాకుపడుతోందనే విషయాన్ని ప్రేమికుడు ముందుగా గ్రహించగలగాలి.

ఏమాత్రం పరిచయం లేకుండానే తొలిచూపులోనే ఐలవ్య్యూ చెప్పినందుకా, అప్పటివరకు స్నేహితుడిగా ఉండి ఒక్కసారిగా నువ్వంటే నాకిష్టం... ఐలవ్య్యూ అంటూ చెప్పినందుకా, లేక తమ మధ్య ప్రేమ వ్యవహారాన్ని పదిమందికి తెలిసేలా చేసి తన ఇమేజ్‌ను పాడు చేసినందుకా, ఇవేమీ కాకుండా అసలు మీ ప్రేయసికి మీరంటేనే ఇష్టం లేదా ఇలా ఏ కారణం వల్ల మీ ప్రియురాలు మిమ్మల్ని చూసి చికాకు పడుతోందన్న విషయాన్ని ప్రతీ ప్రేమికుడు మొదట గ్రహించగలగాలి. అటుపై కారణానికి తగ్గట్టు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నించాలి.

ఏమాత్రం పరిచయం లేకుండానే ఐలవ్య్యూ అంటూ చెప్పినందుకు మీ ప్రేయసి మీపై ఆగ్రహించిందనుకోండి... తొలిచూపులోనే ఐలవ్య్యూ చెప్పడానికి ఎంతటి బలమైన కారణముందో ఆమెకు తెలియజేసే ప్రయత్నం చేయండి. తొలిచూపులోనే మనసు ఎంతగా స్పందించకుంటే వెంటనే ఐలవ్య్యూ అంటూ చెప్పుంటాను... ఆమాత్రం అర్థం చేసుకోలేవా... కావాలంటే నీకోసం ఎన్ని ఏళ్లైనా ఇలాగే నిరీక్షిస్తా... నాగురించి అర్థమయ్యాకే నా ప్రేమకు పచ్చజెండా ఊపు అంటూ మీ ప్రేయసికూడా మీగురించి ఆలోచించే విధంగా ఆమెకు చెప్పి చూడండి.


FileFILE
అలాగే అన్నాళ్లూ మంచి స్నేహితుడిగా ఉండి ఊహించని విధంగా ఐలవ్య్యూ చెప్పినందుకు మీ ప్రేయసి మీపై ఆగ్రహించిందనుకోండి... అలా చెప్పడానికి గల కారణాలను ఆమెకు వివరించే ప్రయత్నం చేయండి. తనలోని మంచితనం, మీపై ఆమె చూపించే అభిమానం, తనతో జీవితం పంచుకోవడం ద్వారా మీ భవిష్యత్ జీవితం రంగులమయమవుతుందని మీ మనసు చెబుతున్న భావాల్ని ఆమెకు విడమర్చి చెప్పండి. అప్పటివరకు కోప్పడిన మీ ప్రేయసి మీ ప్రేమ దరఖాస్తును మరోసారి పరిశీలించకమానదు.

ఇవేమీ కాకుండా మీపై ఇష్టం ఉన్నా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని పదిమందికి తెలిసేలా చేసినందుకు మీ ప్రేయసి మీపై కోపగించుకుందనుకోండి... నిజమే అలా చేయడం పొరబాటే. ఇకపై ఎప్పుడూ అలా చేయను. ఏ విషయాన్ని బయటివారికి చెప్పాలి, ఏది చెప్పకూడదన్న విషయంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పి చూడండి. మీ ప్రేయసి తప్పకుండా మెత్తబడి తీరుతుంది.

ఇలా కారణమేదైనా మీపై చిర్రుబుర్రులాడుతూ, కోపంతో ఊగిపోయే మీ ప్రేయసి ప్రసన్నం చేసుకోవడానికి మార్గం లేకపోలేదు. కాస్త ఓపిగ్గా, మరికొంచెం సమయస్ఫూర్తితో మీరు ఆలోచించగలిగితే ప్రేయసిని ప్రసన్నం చేసుకోవడం మరీ అంతకష్టమేమీ కాదు. కానీ ఇక్కడ మరో విషయం పైన చెప్పిన కారణాలు కాకుండా మీరంటే మీ ప్రేయసికి ఏమాత్రం ఇష్టం లేదంటే మాత్రం మీరు మీ ప్రేమ గురించి మరోసారి ఆలోచించక తప్పదు.

ఎందుకంటే ఏమాత్రం ఇష్టంలేని వారిని వెంటపడి మరీ ఐలవ్య్యూ అని చెప్పించుకోవడానికి జీవితం సినిమా కాదు. అందుకే మీపై మీ ప్రేయసి ఎందుకు ఆగ్రహిస్తోందన్న విషయాన్ని పూర్తిగా గ్రహించి అటుపై మాత్రమే దానికి పరిష్కారాన్ని ఆలోచించండి.

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ తొలిసంతకం.. ఏ ఫైలు మీదో తెలుసా?

ఈ రోజు సాయంత్రమే తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం: పవన్ కల్యాణ్ హర్షం

ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్‌కి రెండు వారాల గడువు ఎందుకు?

తిరుపరంకుండ్రం కొండపై దీపం... వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా ప్రధాని ట్వీట్

తెలంగాణలో చంద్రబాబుకు తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్.. టీడీపీ ఘన స్వాగతం..

Rajendra Prasad : ఎం.ఎస్. నారాయణ మనవరాలి వివాహ వేడుక లో రాజేంద్రప్రసాద్ ఇలా...

Shah Rukh, Kareena : డాడీ కూల్ పాటతో ఆకట్టుకున్న కింగ్ నుంచి షారుఖ్ ఖాన్, కరీనా కపూర్

Kaaka for Sankranti: అటకెక్కిన విశ్వంభర; సంక్రాంతికి కాకాతో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు

కదులుతున్న రైలు ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి అయ్యప్పకు పూజ, ప్రశ్నించిన చిన్మయిపై నెటిజన్ దూషణ

Varanasi first single :వారణాసి నుంచి దించుదించు. అనే ఫస్ట్ సింగిల్ రాబోతోంది

Show comments