1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 మే 2016 (11:49 IST)

అంతా ఫ్రీ మేనిఫెస్టో: అధికారం డీఎంకేదా..? అన్నాడీఎంకేదా? అమ్మకు అరుదైన?

తమిళనాడులో ఎన్నికల వేడి బాగా హీటెక్కింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే-డీఎంకేల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. విజయకాంత్.. కూటములు సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఈసారి అధికారం ఎవరు దక్కించుకుంటారో తెలియదు కానీ.. తమిళనాట రాజకీయ చక్రం తిప్పుతున్న విప్లవనాయిక జయలలితకు అరుదైన ఘనత ఉంది. 
 
ఇప్పటిదాకా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఏకైక మహిళ జయలలిత కావడం గమనార్హం. ఇప్పటివరకు తమిళనాడుకు 14 శాసనసభ ఎన్నికలు జరుగగా అందులో ప్రతిపక్షనేతగా బాధ్యతలు వహించిన ఏకైక మహిళ జయలలిత కావడం విశేషం.
 
1982 ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోడినాయక్కనూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన జయలలిత.. ఆమె నేతృత్వంలోని ఏడీఎంకే 27 స్థానాల్లో గెలిచి విపక్ష హోదాను సొంతం చేసుకున్నారు. 2006 నుంచి 2011వ ఏడాది వరకు కూడా ఆమె ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్నారు.