సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (13:47 IST)

శనివారం మాత్రం 60 కరోనా కేసులు.. కోలుకున్న 24మంది బాధితులు

దేశంలో శనివారం మాత్రం 60 కరోనా కేసులు నమోదైనాయి. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
ఇందులో భాగంగా మహారాష్ట్రలో 74, కేరళలో 52, ఢిల్లీలో 27, ఉత్తరప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 24, తెలంగాణలో 21, హర్యానాలో 17 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 20, పంజాబ్‌లో 13, తమిళనాడులో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే ఛంఢీగడ్‌లో ఐదు, మధ్యప్రదేశ్‌లో నాలుగు, జమ్మూకాశ్మీర్‌లో నాలుగు, పశ్చిమబెంగాల్‌లో నాలుగు మంది కరోనా బాధితులున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 5, ఉత్తరాఖండ్‌లో 3, ఒడిశాలో 2, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2 కేసులు ఉన్నాయి. అసోంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.
 
కరోనా భూతం తరుముకొచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల నిధులు విడుదల చేయకతప్పలేదు. కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పారిశుద్ధ్య పనుల కోసం కేంద్రం ముందుగానే నిధులు విడుదల చేసింది. ఏపీ, తమిళనాడు, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు ఈ నిధులు విడుదల చేశారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
ఏపీకి 2018-19 ఏడాదికి గాను రెండో విడత నిధుల కింద రూ.870.23 కోట్లు విడుదల చేశారు. అంతేకాదు, ఏపీకి 2019-20 ఏడాది మొదటి విడత నిధుల కింద రూ.431 కోట్లు విడుదల చేశారు. మొత్తం ఆరు రాష్ట్రాలకు కేంద్రం రూ.2,570 కోట్లు విడుదల చేసింది.