గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (11:25 IST)

తొమ్మిదేళ్ల బాలిక కడుపులో బిడ్డ.. అది గడ్డ కాదు.. బిడ్డ

తొమ్మిదేళ్ల వయస్సు బాలిక కడుపులో బిడ్డను కనుగొన్నారు వైద్యులు. ఈ వింత యూపీలో ఓ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. యూపీ ఖుషీ నగర్లోని ఓ గ్రామానికి  చెందిన తొమ్మిదేళ్ల బాలిక పుట్టినప్పటి నుంచి కడుపులో నొప్పితో బాధపడుతుండేది. ఆమెకు ఇటీవలే సోనోగ్రఫీ పరీక్షలు చేసిన వైద్యులు షాకయ్యారు. 
 
ముంబై వైద్యులు ఆ బాలిక గురించిన నిజాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో షాకయ్యారు. ఆమె కడుపులు పెరుగుతున్నది గడ్డ కాదని.. బిడ్డ అంటూ తేల్చారు. తల, కళ్లు, చేతులు కాళ్లు వున్న ఓ మృత శిశువు ఆమె కడుపులో వుందని తెలిపారు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఎట్టకేలకు చిన్నారి కడుపులోని మృత శిశువును తొలగించారు.