సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (12:39 IST)

హర్యానా రైతు అకౌంట్‌లోకి రూ.200 కోట్లు.. ఎలా వచ్చాయ్?

హర్యానా రైతు అకౌంట్‌లోకి రాత్రికి రాత్రే ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో రూ.200 కోట్లు పడినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. 
 
వ్యవసాయ చేస్తూ జీవనం సాగించే విక్రమ్ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అయితే బ్యాంక్ అధికారులు చెప్పింది విని షాక్ అయ్యాడు. 
 
అతడి అకౌంట్‌లో రూ.200 కోట్లు వున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. ఈ డబ్బు ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.