దేశంలో ఆవులకూ ఆధార్ నంబర్లు
దేశంలో ఆవులు, దున్నపోతులకు కూడా ఆధార్ తరహాలో నంబర్లు ఇవ్వాలలని కేంద్రం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు లక్ష మంది నిపుణులను సిద్దం చేస్తోంది. సుమారు 88 లక్షలు ఉన్న పశుసంపదకు 12 అంకెలు ఉండ
దేశంలో ఆవులు, దున్నపోతులకు కూడా ఆధార్ తరహాలో నంబర్లు ఇవ్వాలలని కేంద్రం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం సుమారు లక్ష మంది నిపుణులను సిద్దం చేస్తోంది. సుమారు 88 లక్షలు ఉన్న పశుసంపదకు 12 అంకెలు ఉండే విశిష్ట సంఖ్యలను కేటాయిస్తారు.
పశువులకు చెవికి ఈ ట్యాగ్‌ను అమర్చాక, ట్యాబ్ ద్వారా ఆన్‌లైన్ డేటాబేస్ నమోదు చేసి యజమానికి యానిమల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. పశువుల వ్యాక్సినేషన్, సంతానోత్పత్తి, పాల దిగుబడి తదితర వివరాలన్నీ ఆ కార్డులో నమోదు చేస్తారు. ఇప్పటికే వందకోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. అదే విధానాన్ని పశు సంపదకు అమలు చేస్తోంది.