గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (10:52 IST)

కలిసి పని చేద్దామంటూ అసభ్యంగా ప్రవర్తించాడు... చిక్కుల్లో ఆప్ నేత

అవినీతిరహిత పాలన అందిస్తామంటూ ప్రచారం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో మాత్రం ముందంజలో ఉన్నారు. ఇలా ప్రవర్తించి.. అరెస్టు అయిన ఆప్ నేతల

అవినీతిరహిత పాలన అందిస్తామంటూ ప్రచారం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో మాత్రం ముందంజలో ఉన్నారు. ఇలా ప్రవర్తించి.. అరెస్టు అయిన ఆప్ నేతల సంఖ్య ఢిల్లీలో డజనుకుపైగా ఉన్నారు. ఇపుడు పంజాబ్ నేతలవంతు వచ్చింది. ఈ రాష్ట్రానికి చెందిన ఆప్ నేత ఒకరు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. 
 
ఓ పని పేరిట తన వద్దకు వచ్చిన సమయంలో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, అసభ్యంగా తాకాడని చెప్పింది. తాను చివరికి ఎలాంటి హానీ జరగకుండా తప్పించుకొని బయటపడ్డాక కూడా ఫోన్ కాల్స్ చేసి వేధించాడని, ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని, మరోసారి కలిసి పనిచేద్దామని పలుమార్లు బ్రతిమాలినట్లు ఆరోపిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పంజాబ్కు చెందిన దేవ్‌మన్ అనే ఆప్‌కు చెందిన వ్యక్తి పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయనను 2017 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దించుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ఈ లోగానే ఆయనపై వేధింపుల ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై దేవ్‌ను ప్రశ్నించగా ఇదంతా శిరోమణి అకాలీదళ్ నేతలు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగానే జీర్ణించుకోలేని ఆ పార్టీ తనపై మరో ఇద్దరు భారత సంతతికి చెందిన కెనడీయన్ మహిళలతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.