గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2025 (09:01 IST)

ఢిల్లీ అసెంబ్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిజంగానే నిద్రపోయారా? (Video)

rekha gupta
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె నిద్రపోతున్నట్టుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. 
 
ఈ వీడియో చూసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో నిద్రిస్తున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేశారు. "వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా? అని రాసుకొచ్చింది. "ఢిల్లీ బాగోగులు చూడటానికి ప్రజలను ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆమె నిద్రపోతున్నారు" అని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.