గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (19:50 IST)

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

borewell
దేశ ఐటీ నగరంగా గుర్తింపు పొందిన బెంగుళూరు మహానగరంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో బెంగుళూరు వాసులు తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ నగరంలో నీటి ఎద్దడి ఏర్పడటం ఇది వరుసగా మూడో యేడాది కావడం గమనార్హం. అయితే, ఈ దఫా వేసవికాలం ఇంకా మొదలుకాకముందే నగరంలో తాగునీటి సమస్య ఉత్పన్నంకావడంతో అటు ప్రజలతో ఇటు పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు, ఐఐఎస్సీ సైంటిస్టులు సైతం బెంగుళూరు నగరంలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 
 
బెంగుళూరు నగరంలో భూగర్భజలాలు మరింతగా అడుగంటిపోయాయి. ఇది అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. గతంలోనూ బెంగుళూరులో నీటికి కటకట ఏర్పడినా, ఈసారి మాత్రం వేసవికాలం ఆరంభంకాకముందే నీటి కొరత ఏర్పడటం గమనార్హం. దీంతో బెంగుళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో కొత్తగా బోర్లు వేయడంపై నిషేధం విధించింది. 
 
పరిస్థితులు మరింతగా అంచనా వేసి కొత్త బోర్లు తవ్వడంపై యేడాది పొడవునా నియంత్రణ చేపడుతామని బీడబ్ల్యూఎస్ఎస్‌బీ వెల్లడించింది. తమ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ఎవరైనా బోర్లు వేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
 
భూగర్భ జలాల మట్టం పడిపోవడంతో బెంగుళూరులో ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. మరోవైపు, ఈ ఐటీ నగరంలో ఏర్పడిన నీటి ఎద్దడిపై ఐఐఎస్సీ సైంటిస్టులు కూడా రెడ్ అలెర్ట్ జారీచేశారు. కొత్త బోర్లు తవ్వుకుంటామంటూ ఇటీవల లెక్కుకు మిక్కిలిగా దరఖాస్తులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఐఐఎస్ శాస్త్రవేత్తలు సిఫారసులను పరిగణనలోకి తీసుకుని వాటర్ బోర్డు నిషేధం విధించింది.