గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 మే 2021 (11:13 IST)

మళ్లీ పెట్రోల్‌ ధరల బాదుడు

భారత్‌లో ఇంధన ధరలు గురువారం కూడా పెరిగాయి. ఈ నెల 4న పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 14 సార్లు చమురు ధరలను కేంద్రం పెంచి...సామాన్యుడికి పెట్రో ధరలను మరింత ప్రియం చేసింది. గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 23 పైసలు పెరగ్గా..డీజిల్‌పై 30 పైసలను చమురు సంస్థలు వడ్డించాయి.

ఈ ధరలతో ముంబయిలో పెట్రోల్‌ ధర 100 రూపాయలకు చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.68, డీజిల్‌ ధర రూ. 84.61గా చేరింది. ఇక ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 99.94లకు చేరుకోగా..డీజిల్‌ ధర 91.87కు చేరువైంది.

చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 95.28 చేరువ కాగా, డీజిల్‌ ధర 89.39గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.72 ఉండగా..డీజిల్‌ ధర 87. 46 రూపాయలుగా నమోదైంది. ఇక ఆయా రాష్ట్రాల్లోని టాక్స్‌ల ఆధారంగా ధరల్లో మార్పులు సంతరించుకుంటాయి.