ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 మార్చి 2017 (20:14 IST)

'అమ్మ' అలా చనిపోయింది... AIIMS నివేదిక, ఆసుపత్రికి వచ్చేటప్పటికే అపస్మారకంలోకి...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై గత కొన్ని రోజులుగా అనేక అనుమానాలతో కూడిన వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో వార్త ఒక్కో కోణంలో ఆసక్తిని రేకెత్తించాయి. చివరికి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయ మేనకోడలు దీప, డీఎంకే చీఫ్ స్టాలిన్ సైతం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై గత కొన్ని రోజులుగా అనేక అనుమానాలతో కూడిన వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో వార్త ఒక్కో కోణంలో ఆసక్తిని రేకెత్తించాయి. చివరికి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయ మేనకోడలు దీప, డీఎంకే చీఫ్ స్టాలిన్ సైతం అమ్మ మరణంపై అనుమానాలున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం అమ్మ జయలలితకు అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చిన నాటి నుంచి మరణించేవరకూ జరిగిన చికిత్స వివరాలను తెలియజేయాలంటూ ఎయిమ్స్‌ను నివేదిక కోరింది. సోమవారం నాడు ఎయిమ్స్ 19 పేజీల నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. 
 
ఆ నివేదిక ప్రతులను తమిళనాడు ప్రభుత్వం మీడియాకు బహిర్గతం చేసింది. అందులో జయలలిత శ్వాసకోశ, డీహైడ్రేషన్‌ సమస్యలతో తొలుత ఆసుపత్రిలో చేరారనీ, ఐతే ఆసుపత్రిలో చేరినప్పటికే ఆమె అపస్మారకంలోకి వెళ్లిపోయారని వెల్లడించారు. ఐతే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లేవరకూ ఏం చేశారన్నది ప్రశ్న. ఇదిలావుంటే జయకు సాధ్యమైనంతవరకు అత్యుత్తమ వైద్య సేవలందించినట్లు నివేదికలో తెలిపారు. జయలలిత మృతిపై వస్తున్న వదంతులు, ఆరోపణలన్నీ నిరాధారాలంటూ నివేదికలో ఉటంకించారు. 
 
కాగా జయలలిత ఆరోగ్యం విషమంగా ఉన్నప్పుడు ఢిల్లీకి నుంచి ఎయిమ్స్ వైద్యులు చెన్నై అపోలో ఆసుపత్రికి వచ్చి ఐదుసార్లు చికిత్స అందించారు. ఆ సమయంలో ఏయే వైద్యులు ఎలాంటి చికిత్సలు అందించారన్న వివరాలను కూడా పొందుపరిచారు. మరి ఈ నివేదికపై అటు పన్నీర్ సెల్వం, ఇటు స్టాలిన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.