బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (10:22 IST)

ఈ బాబా.. మర్మాంగంతో ట్రాక్టర్‌ను లాగేశాడు..

సాధారణంగా కొందరు సాహసం చేస్తుంటారు. ఇలాంటివారి పెద్ద పెద్ద ట్రక్కులను, ట్రాక్టర్లను, బండ్లను, రాళ్లను తల వెంట్రుకలు, పళ్లతో లాగడం చూశాం. కానీ ఈ సాధువు మాత్రం ఏకంగా తన మర్మాంగానికి తాడును కట్టి ట్రాక్ట

సాధారణంగా కొందరు సాహసం చేస్తుంటారు. ఇలాంటివారి పెద్ద పెద్ద ట్రక్కులను, ట్రాక్టర్లను, బండ్లను, రాళ్లను తల వెంట్రుకలు, పళ్లతో లాగడం చూశాం. కానీ ఈ సాధువు మాత్రం ఏకంగా తన మర్మాంగానికి తాడును కట్టి ట్రాక్టర్‌ను లాగి.. అందరిని ఆకర్షిస్తున్నాడు. 
 
అలహాబాద్‌లో నిర్వహించిన మాఘ్ మేళాలో ఈ ప్రదర్శననను సాధువు చేశాడు. ఈ ప్రదర్శన ద్వారా తన ఆధ్యాత్మిక శక్తిని నిరూపించుకున్నట్లు సాధువు ప్రకటించాడు. సాధువు చేసిన సాహసానికి అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. 
 
2014లో ఓ సాధువు డజన్ల కొద్ది ఇటుకలను తన మర్మాంగానికి కట్టుకొని ప్రదర్శన ఇచ్చాడు. 2016లో మరో సాధువు తన మర్మాంగానికి తాడు కట్టి బండ రాయిలను లాగాడు.