ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 8 ఏప్రియల్ 2017 (12:59 IST)

బెంగళూరు వచ్చేయ్... రైలెక్కేసిన తెలంగాణ యువతి, గదిలో పెట్టి వాంఛ తీర్చుకుని...

ఫేస్ బుక్ ప్రేమలు ఇటీవలి కాలంలో బాగా ఎక్కువవుతున్నాయి. ఈ ప్రేమల్లో చాలామటుకు వికటిస్తున్నాయి. ఎవడో ముక్కూమొఖం తెలియని వాడు ఫేస్ బుక్ లో చాటింగ్ కు రావడం, అమాయకంగా కొంతమంది యువతులు వారి వలలో పడిపోవడం జరుగుతోంది. ఆ తర్వాత వారితో లైంగిక వాంఛలు తీర్చుకున

ఫేస్ బుక్ ప్రేమలు ఇటీవలి కాలంలో బాగా ఎక్కువవుతున్నాయి. ఈ ప్రేమల్లో చాలామటుకు వికటిస్తున్నాయి. ఎవడో ముక్కూమొఖం తెలియని వాడు ఫేస్ బుక్ లో చాటింగ్ కు రావడం, అమాయకంగా కొంతమంది యువతులు వారి వలలో పడిపోవడం జరుగుతోంది. ఆ తర్వాత వారితో లైంగిక వాంఛలు తీర్చుకుని ముఖం చాటేయడం మామూలైంది. తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. 
 
ఇతడికి ఫేస్ బుక్‌లో తెలంగాణకు చెందిన యువతి పరిచయమైంది. 2015లో చాటింగ్‌తో మొదలైన అతడి పరిచయం ఇంటి దాకా తెచ్చుకోగల స్థితికి చేరిపోయింది. ఒకసారి బెంగళూరు వస్తావా అని ఆమెను అభ్యర్థించాడు. ప్రేమికుడు... పైగా అభ్యర్థిస్తున్నాడు... ఇంకే అడ్డుచెప్పకుండా సదరు యువతి బెంగళూరుకు రైలెక్కేసింది. ఆమెను రిసీవ్ చేసుకున్న వినయ్ ఇంటికి తీసుకెళ్లి తన సెక్స్ వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోయింది. 
 
మళ్లీ కొన్నాళ్లకు నిన్నే పెళ్లాడుతా... మళ్లీ బెంగళూరు వచ్చెయ్ అని ఆమెను పిలిచాడు. ప్రియుడు అభ్యర్థనకు ఆమె మరలా అతడివద్దకు వెళ్లింది. ఈసారి ఆమను తన అక్కాబావల వద్ద వుంచి అక్కడ వున్నన్నాళ్లు ఆమెతో తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆమె తన సొంతు వూరికి వెళ్లింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన వినయ్ దగ్గర నుంచి కబురు లేకపోయేసరికి సదరు యువతి ఫేస్ బుక్‌లో అతడి చర్యలు చూసి షాక్ తిన్నది. 
 
అతడు మరో యువతిని లైన్లో పెట్టడం తెలుసుకుని నేరుగా బెంగళూరు వెళ్లి అతడి తల్లిదండ్రులను నిలదీసింది. దాంతో వారు తమ కుమారుడికి రూ. 16 లక్షల కట్నం ఇచ్చే సంబంధం కుదిరిందనీ, నువ్వు కూడా అంత ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు. దీనితో వినయ్ కు ఫోన్ చేయగా... బెంగళూరు వచ్చేయ్ మాట్లాడుకుందామని చెప్పాడు. కానీ అక్కడికి వెళ్లగా అతడు అక్కడి నుంచి చెక్కేసాడు. తన అక్కాబావలు ఇంటికి వెళితే గదికి తాళం వేసి వుంది. దానితో తను మోసపోయానని గ్రహించి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. రంగంలోకి దిగిన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.