దేశంలో మరో 61,408 పాజిటివ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. దీంతో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 31,06,348కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో 836 మంది మఅతి చెందారని, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 57,542కి చేరింది.
పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. రికవరీల కూడా క్రమంగా పెరుగుతోందని వెల్లడించింది. ఆదివారం 57వేల మంది కరోనా నుండి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 23,38,036 మంది కరోనా నుండి కోలుకున్నారు. 7 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీల రేటు 75 శాతానికి చేరింది. దేశంలో కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
రికవరీలు, యాక్టివ్ కేసుల మధ్య తేడా అధికంగా ఉందని, ప్రస్తుతం రికవరీల సంఖ్య యాక్టివ్ కేసుల సంఖ్య కన్నా మూడు రెట్లు అధికంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,28,566 మంది కరోనా నుండి కోలుకోగా, 7,07,668 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ డేటా తెలిపింది.