గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (20:01 IST)

ఏపీలో మరో 9,276 పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 9,276 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 59 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,50,209కి చేరగా.. మరణాలు 1,407కు చేరాయి. 72,188 మంది చికిత్స పొందుతుండగా.. 76,614 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పరీక్షలు 20 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రాకపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.