బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (13:25 IST)

ఆటో డ్రైవర్‌ను నగ్నంగాచేసి బ్లేడుతో కోసి హతమార్చిన మిత్రులు

బెంగుళూరులో దారుణం జరిగింది. ఓ ఆటో డ్రైవర్‌ను అతని మిత్రులే హతమార్చారు. అదీకూడా అతని ఆటోలోనే నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి... నగ్నంగా మార్చి బ్లేడుతో కోసి చంపేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన మారతహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి దేవరచిక్కనహళ్ళికి అనే ప్రాంతానికి చెందిన కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా జీవనంసాగిస్తున్నాడు. ఈయనకు కిశోర్, పవన్ అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ గ్యాంగ్‌గా ఏర్పడి, కుమార్‌ను అతని ఆటోలోనే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 
 
ముందుగా వేసుకున్న తమ పథకం ప్రకారం... ఆటో డ్రైవర్‌ను నగ్నంగా చేసి బ్లేడ్‌తో కోసి హతమార్చారు. ఆ తర్వాత ఈ దారుణాన్ని మొబైల్‌ ఫోనులో వీడియో తీశారు. ఈ హత్యకు పాల్పడిన కిశోర్, పవన్‌లతో పాటు.. ఇతరులపై వివిధ రకాల నేరాలు నమోదైవున్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.