ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (10:13 IST)

జనవరిలో దీపావళి.. వెలిగిపోతున్న అయోధ్య

Lord Rama
Lord Rama
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం మరికొద్ది గంటల్లో జరుగనున్న నేపథ్యంలో దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. 'జనవరిలో దీపావళి' పండుగను పోలిన అద్భుతమైన ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. 
 
నెట్టింట సోషల్ మీడియాలో రామ్ ప్రాణ్ ప్రతిష్ఠకు సంబంధించిన మీమ్స్‌ను పేలుస్తూ సందడి చేస్తున్నారు. రామభక్తికి సంబంధించిన భావాలను నెట్టింట పోస్టు చేస్తున్నారు. 
 
సోమవారం అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలెబ్రిటీలు, ప్రముఖులు అయోధ్య చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్‌లు సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో అయోధ్యకు బయల్దేరారు. 
 
 
సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియోలో, రణబీర్ కపూర్ తన కారు నుండి బయటికి వచ్చినప్పుడు ధోతీ-కుర్తాలో కనిపించారు. అలియా భట్ చీరకట్టులో కనిపించింది.