ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (09:38 IST)

బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో కలిసి చిందేసిన రాందేవ్ బాబా

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా డాన్సర్‌గా మారిపోయారు. సూపర్ డాన్సర్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆయన పిల్లల ప్రదర్శనకు ముగ్ధుడై పోయారు. ఈ సందర్భంగా ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్ట

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా డాన్సర్‌గా మారిపోయారు. సూపర్ డాన్సర్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆయన పిల్లల ప్రదర్శనకు ముగ్ధుడై పోయారు. ఈ సందర్భంగా ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో కలిసి నృత్యం చేశారు. 
 
ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత చిన్నపిల్లల నృత్యం చూసి.. వారిని ఉత్సాహపరుస్తూ... వారితో కలిసి డాన్స్ చేశారు. దర్శకుడు అనురాగ్ బసు, కొరియోగ్రాఫర్ గీతా కపూర్ కూడా రాందేవ్ బాబాతో కాలు కదపడం విశేషం. గతంలో పలు సందర్భాల్లో తన నాట్యప్రావీణ్యం చూపిన రాందేవ్ బాబా మరోసారి నృత్యం చేయడం అందర్నీ ఆకట్టుకుంది.