బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 మే 2021 (13:36 IST)

ద్రవిడ సమూహానికి చెందిన నేతను : సీఎం స్టాలిన్

తాను ద్రవిడ సమూహానికి చెందిన వ్యక్తినని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆయన ఈ నెల 7వ తేదీన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆయన... తన ట్విట్టర్‌లో తాను ద్రవిడ సమూహానికి చెందిన వాడినని పేర్కొన్నారు. 
 
ఈ మాటల్లో ఉన్న విశేషం ఓసారి పరిశీలిస్తే.... పలు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు‌. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది క్షణాల్లోనే ఆయన ట్విట్టర్‌ పేజీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు అనే వ్యాఖ్యలతో పాటు ద్రావిడ సమూహానికి చెందిన వాడిని అనే వ్యాఖ్యలు తాజాగా చోటుచేసుకున్నాయి. 
 
రాష్ట్రంలో 50 ఏళ్లుగా డీఎంకే, అన్నాడీఎంకే అధికారం చేపడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల నుంచి ద్రవిడ అనే మాటను వేరుచేసేందుకు వీలు కాదు. గత 1962లో పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై.. తాను ద్రావిడ సమూహానికి చెందిన వాడినని ముగించడం గమనార్హం.