తమిళనాడులో 14 రోజుల లాక్డౌన్... మే 10 నుంచి 24 వరకు
కోవిడ్ -19 కేసుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో 14 రోజుల పూర్తి లాక్డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ మే 10 నుండి ప్రారంభమై మే 24 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. తమిళనాడులో కోవిడ్ -19 కేసులు పెరగడం వల్ల రాష్ట్రంలో “అనివార్యమైన పరిస్థితుల” కారణంగా షట్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మే 10 నుండి కూరగాయలు, మాంసం,చేపల దుకాణాలు, తాత్కాలిక దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. మిగతా అన్ని షాపులను మూసివేయాలని ఆదేశించింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం షాపులు మూసివేయబడతాయని పేర్కొంది.. తమిళనాడులో 14 రోజుల పూర్తి లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే ఆపరేట్ చేయడానికి అనుమతిస్తారు. లాక్డౌన్ సమయంలో పెట్రోల్ ,డీజిల్ బంకులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.