సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (22:12 IST)

అనేక జబ్బులకు కారణమవుతున్న కరోనా - వాటిలో ఒకటి అంధత్వం

దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. అనేక జబ్బులకు కారణమవుతుంది. ఈ వైరస్ సోకి, ఆ తర్వాత కోలుకున్న వ్యక్తులకు వివిధ రకాలైన జబ్బులు వస్తున్నట్టు తాజాగా నిర్వహించిన వైద్యలు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా అనేక అవయవాలు పనితీరు దెబ్బతింటున్నట్టు తేలింది. 
 
కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ, ఆ వైరస్ మహమ్మారి కలిగించిన నష్టంతో అనేక మంది కోలుకోలేక మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా, కరోనా వైరస్ సోకిన వ్యక్తి అనేక ఇతర జబ్బులకు కూడా గురవుతున్నట్టు వైద్యులు గుర్తించారు. 
 
కరోనా నుంచి కోలుకున్న 8 మంది వ్యక్తులకు కంటిచూపు పోయిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగుచూసింది. కరోనా నుంచి కోలుకున్న ఆ వ్యక్తులు కంటిచూపు కోల్పోయారు. ఈ బాధితులను పరిశీలించిన వైద్య నిపుణులు, మ్మూకోర్మిసిస్ అనే బ్లాక్ ఫంగస్ కంటిచూపును హరించివేసిందని గుర్తించారు. 
 
కాగా, ఈ ఫంగస్ ఎంతో ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం హరించివేస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి ఈఎన్ టీ విభాగం హెడ్ డాక్టర్ అజయ్ స్వరూప్ స్పందించారు. కరోనా చికిత్సకు వాడే ఔషధాల వల్ల బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని, ఇప్పటికే 40 మంది వరకు ఈ విధంగా కంటిచూపును కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు.