బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:55 IST)

కరోనా బాధితులకు సచిన్ అండ.. మిషన్ ఆక్సిజన్‌కు కోటి రూపాయలు

కరోనా బాధితులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలిచారు. కరోనా బాధితులకు సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్‌ కొరతతో బాధపడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్‌ ఆక్సిజన్‌ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్‌ అందజేశారు.
 
ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. 250 మందికి పైగా యువకులతో మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థ వైరస్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించేందుకు పనిచేస్తోంది. 
 
దేశంలో మొదటిసారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన సచిన్‌.. ప్రస్తుతం మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడంతో సచిన్‌ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిగతా క్రికెటర్లు కూడా దేశం కోసం సాయం చేయాలంటూ.. మరికొందరు కామెంట్స్‌ ద్వారా కోరుతున్నారు.