సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:12 IST)

రైల్వే పట్టాలపై పడిన బాలుడు.. కాపాడిన రైల్వే ఉద్యోగి.. కానుకల వెల్లువ.. కానీ..?

Mayur shelke
రైల్వే పట్టాలపై పడిపోయిన బాలుడిని ముంబైకి చెందిన పాయింట్స్‌ మ్యాన్ క్షణాల్లో రైలు నుంచి కాపాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరో అయిపోయాడు. ఆ రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. నెటిజన్లు. 
 
రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు నెటిజన్స్ అతన్ని ఆకాశానికి ఎత్తారు. రైల్వే స్టేషన్‌లో అకస్మాత్తుగా పట్టాలపై పడిన బాలుడిని రక్షించేందుకు.. మయూర్ షెల్కే తన ప్రాణాలకు తెగించి థానే జిల్లాలోని వంగాని స్టేషన్‌లో రైలుకు ఎదురుగా వెళ్లి ఆ చిన్నారిని కాపాడాడు. 
 
అయితే ఇప్పటికే విశేష రీతిలో ప్రజాదరణ పొందుతున్న మయూర్ మరోసారి తన గొప్పతనాన్ని చాటారు. బాలుడిని రక్షించినందుకు రైల్వే శాఖ మయూర్‌కు 50 వేల నగదు బహుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆ అమౌంట్‌లో సగం మొత్తాన్ని ఆ బాలుడికే విరాళం ఇవ్వనున్నట్లు మయూర్ తెలిపాడు. 
 
చిన్నారి సంక్షేమం, విద్య కోసం ఆ నగదు ఉపయోగపడుతుందన్నాడు. ఆ చిన్నారి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్లు తెలిసిందన్నాడు. మరోసారి ఔదార్యం చాటిన మయూర్‌పై నెటిజన్లు మళ్లీ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
మానవత్వం సజీవంగా ఉన్నట్లు ఒకరు కామెంట్ చేశారు. ఈ రోజుకు ఇదే పాజిటివ్ న్యూస్ అని మరొకరు స్పందించారు. ఈ సమాజంలో షెల్కే లాంటి వ్యక్తులు ఉండడం మానవత్వానికి గీటురాయిని అని ఓ నెటిజన్‌ కామెంట్ చేశారు.