శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 ఫిబ్రవరి 2021 (12:49 IST)

కాణిపాకం సిద్ధివినాయకుడికి ఎన్నారై భక్తుడు రూ. 7 కోట్ల భారీ కానుక

చిత్తూరు జిల్లాలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకుడు ఎంతో శక్తిమంతమైనవారుగా చెపుతుంటారు. ఆ దేవాలయానికి వెళ్లి భక్తులు స్వామివారిని మొక్కితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి.
 
ఆ స్వామివారికి తాజాగా ఓ ఎన్నారై భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. ఆలయ పునర్ నిర్మించేందుకు అయ్యే ఖర్చు రూ. 8.5 కోట్లు తనే భరిస్తానని చెప్పిన భక్తుడు తొలి దఫాగా రూ. 7 కోట్లు చెక్కును ఆలయ ఈవోకి అందించారు. 
 
ఆలయానికి వచ్చిన ఆ ఎన్నారై భక్తుడు, కుటుంబానికి ఈవో ఆలయ మర్యాదలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కాగా తన పేరును వెల్లడించేందుకు ఎన్నారై భక్తుడు నిరాకరించారు.