బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (18:39 IST)

అందమైన భార్య ఆ కండిషన్ పెట్టింది, తీర్చలేదని విడాకుల నోటీస్, భర్త కన్నీటి పర్యంతం

ఆమె ఎంతో అందగత్తె. పైగా బ్యాంకు ఉద్యోగి. ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని పెద్దలతో రాయబారం పంపించాడు. ఆమె అబ్బాయి ప్రవర్తన నచ్చి ఓకే చెప్పింది. మరి విడాకులు నోటీస్ ఎందుకు ఇచ్చింది?
 
పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో అరేరా హిల్స్ ప్రాంతానికి చెందిన యువకుడు రెండున్నరేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లాడాడు. ఐతే పెళ్లిచూపులు రోజు అతడికి చిన్న కండిషన్ పెట్టింది. తనకు ఆస్ట్రేలియాలో చదువుకుని ఇంకా మంచి స్థానానికి వెళ్లాలని ఆశ. పెళ్లయిన తర్వాత కూడా నేను చదువుకునేందుకు ఆస్ట్రేలియా పంపాలన్నది కండిషన్. దానికి అతడు ఓకే చెప్పాడు.
 
ఆ తర్వాత ఆమెతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు అవసరమైన టెస్ట్ రాయించాడు. ఆ పరీక్షలో ఆమె ఫెయిల్ అయింది. చేసేది లేక అదే చదువు వేరే దేశాల్లో వుందని తెలుసుకుని అక్కడికి వెళ్లమని కోరాడు. దానికి ఆమె నుంచి సమాధానం రాలేదు కానీ రెండ్రోజుల క్రితం అతడికి విడాకుల నోటీసు వచ్చింది. తన కోర్కె తీర్చనందుకు నా భర్తకు నేను డైవోర్స్ ఇవ్వాలనుకుంటున్నానంటూ అందులో పేర్కొంది.
 
ఆ నోటీసు చూసిన భర్త హతాశుడయ్యాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు తన భార్య కావాలనీ, ఆమెను ఆస్ట్రేలియాలో చదివించేందుకు సిద్ధమని చెప్పాడు. ఐతే ఆమె అందుకు అవసరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఇదంతా చూసిన వారి బంధువులు.. పిచ్చి పిల్ల.. ఇంత చిన్నదానికే విడాకులు తీసుకుంటావా? చూడు నీ భర్త నీకోసం ఎంత తపిస్తున్నాడో అంటూ నచ్చచెప్పారట. కానీ ఆమె మాత్రం మౌనం వీడలేదట. మరి ఏం చేస్తుందో?