బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:28 IST)

మావోయిస్టులపై డ్రోన్‌తో బాంబుల దాడి?

తమను అణచివేసే లక్ష్యంతో భద్రత బలగాలు తొలిసారిగా డ్రోన్‌తో బాంబులు వేశాయని మావోయిస్టులు ఆరోపించగా.. దీన్ని పోలీసులు ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప పేరిట మీడియాకు బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. 
 
బొత్తలంక, పాలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఈ నెల 19 తెల్లవారుజామున పోలీసులు డ్రోన్‌తో 12 బాంబులను అడవిలో వదిలారని లేఖలో ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. డ్రోన్‌ సహాయంతో బాంబుల దాడి ఆరోపణల్లో నిజం లేదని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ఖండించారు.
 
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా సోన్పూర్‌-కుందల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌) జవాను సునీల్‌సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై అపహరణబీజాపుర్‌ జిల్లా పలనార్‌లో ఓ ఎస్సైని బుధవారం మావోయిస్టులు అపహరించారు. 
 
జగదల్‌పూర్‌లో ఎస్సైగా పనిచేస్తున్న మురళీ ఇటీవల సెలవుపై పెట్టి స్వగ్రామమైన పలనార్‌కు వచ్చారు. సాయంత్రం సమయంలో ఆయన అపహరణకు గురైనట్లు ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌ తెలిపారు.