శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (11:18 IST)

అలెర్ట్: ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తాం: లండన్ వెళ్లే విమానాన్ని..?

ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలోని పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తి పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి లండన్ వెళ్లే విమానాన్ని బాంబుతో పేల్చివేస్తానని బెదిరించాడు. ఈ ఫోన్ గురువారం అర్థరాత్రి ఢిల్లీలోని రన్హోలా పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని, ఆ తర్వాత ఢిల్లీ పోలీసు సహా అన్ని భద్రతా సంస్థలు ఈ ఫోన్ కాల్‌పై దర్యాప్తు చేస్తున్నారు. 
 
గురువారం రాత్రి 10.30 గంటలకు, రన్‌హౌలా పోలీస్ స్టేషన్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేసి, 9/11 తరహాలో, లండన్‌కు ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తానని చెప్పాడు. ఈ సమాచారం అందిన వెంటనే, మొత్తం పోలీస్ స్టేషన్‌లో కలకలం రేగింది. 
 
ఈ విషయం గురించి ఉన్నతాధికారులందరికీ సమాచారం ఇవ్వడంతో డిసిపి విమానాశ్రయానికి కూడా సమాచారం అందించారు. ఖలిస్తానీ ఉగ్రవాదులు దీని వెనుక ఉండవచ్చని కాలర్ ఇంటర్నెట్ కాలింగ్‌ను ఆశ్రయించినట్లు దర్యాప్తులో తేలింది.