బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (10:36 IST)

9/11 దాడులు జరిగి నేటికి 19 ఏళ్లు: 3,000 మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ ట్విన్‌ టవర్స్ మీద 9/11 దాడులు జరిగి నేటికి 19 ఏళ్లు. ఆ దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు.2001 సంవ‌త్స‌రం సెప్టెంబ‌రు 11న అమెరికా దేశంలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ పైన ఆల్‌ఖైదా ఉగ్రవాదులు జ‌రిపిన దాడులు చ‌రిత్ర మ‌ర‌వ‌లేదు. ఒక్క అమెరికాయే కాదు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఒక్క‌సారిగా ఈ ఘ‌ట‌న‌తో ఉలిక్కిప‌డ్డాయి. 
 
అమెరికా సంయుక్త రాష్ట్రాల‌పై ఒసామా బిన్ లాడెన్ బృందం ప‌క్కా వ్యూహంతో జ‌రిపిన దాడుల‌వి. ఆ రోజు ఉద‌యం 10 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు.. నాలుగు ప్ర‌యాణికుల జెట్ విమానాల‌ను దారి మ‌ళ్లించి న్యూయార్క్ ట్విన్‌ టవర్స్ పైన దాడికి పాల్పడ్డారు. సౌదీ అరేబియా, ఇత‌ర అర‌బ్ దేశాల‌కు చెందిన వారే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు అనంతరం దర్యాప్తు బృందాలు గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్ర ముఠాకు అప్ప‌టి ఆల్‌ఖైదా నాయ‌కుడు ఓసామా బిన్ లాడెన్ నేతృత్వం వ‌హించారు. ఈ దాడుల్లో 3,000 మంది బాధితులు, 19 మంది హైజాక‌ర్లు మ‌ర‌ణించారు.
 
ఇదిలావుంటే, 2001 సెప్టెంబర్ 11న నాలుగు ప్రయాణికుల విమానాలను ఇస్లామిస్ట్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. ఆ విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తోపాటు, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. అనుకోకుండా జరిగిన దాడితో.. చూస్తుండగానే, న్యూయార్క్ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. బహుళ అంతస్తులతో కూడిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను రెండు విమానాలు ఢీకొన్నప్పుడు సుమారు 10,000 గ్యాలన్ల జెట్ ఇంధనం చిమ్ముకుంది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
 
ఆ నాటి దాడుల్లో మూడు వేల మంది అశువులుబాసారు. ఇందులో నాలుగు విమానాలకు సంబంధించి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది, సాధారణ పౌరులు ఉన్నారు. అలాగే, సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాప‌క ద‌ళ సిబ్బంది, పోలీసులు 836 మంది మ‌ర‌ణించారు. 
 
జంట భ‌వ‌నాలు కుప్పకూలిన ఘటనలో దుర్మ‌ర‌ణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాప‌క ద‌ళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ న‌గ‌రం, పోర్ట్ అథారిటీల‌కు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. 
 
ఇంకా పెంట‌గాన్ భ‌వ‌నంపై జ‌రిగిన దాడుల్లో 184 మంది సహాయక సిబ్బంది కూడా ప్రాణాలొదిలారు. మ‌ర‌ణించిన వారిలో అత్య‌ధికులు సాధార‌ణ పౌరులే. వారిలో 70కి పైగా ఇత‌ర దేశాల‌కూ చెందినవారు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కులు చెబుతున్నాయి.